- Home
- bollywood
నయన్ కి బాలీవుడ్ మూవీ కోసం రెట్టింపు ఇస్తామని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు!
షారుక్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఒక బాలీవుడ్ సినిమా చేయడానికి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆలస్యమైంది కానీ, లేదంటే ఈ సినిమా ఈ పాటికి సెట్స్ పైకి వెళ్లేదే. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను అడుగుతున్నారని అంటున్నారు. నయనతార ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్లు తీసుకుంటోందట. అంతకి రెట్టింపు ఇస్తామని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. మరి, ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంటుందా అనేదే చాలామంది డౌటు!