ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి కీలక అప్ డేట్

Admin 2021-06-30 11:20:12 entertainmen
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. వారిద్దరు ఒకే బైక్‌పై వెళ్తోన్న ఓ ఫొటోను ఆ సినిమా బృందం విడుద‌ల చేసింది. రెండు పాట‌లు మిన‌హా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని వివ‌రించింది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా వదులుతూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతున్నారు. బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.