కథనాయికగా ఆదిలోనే వరుస హిట్లు అందుకోవడం .. యూత్ హృదయాలను దోచేయడం చాలామంది విషయంలో అంత తేలికగా జరగదు. కానీ అవిక గోర్ విషయంలో అవి అవలీలగా జరిగిపోయాయి. ముద్దుగా .. బొద్దుగా తెరపై ఈ అమ్మాయి చేసిన అల్లరికి ప్రేక్షకులు మురిసిపోయారు. వరుస విజయాలు దక్కుతూ ఉండటంతో, ఆమెకి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. వరుసగా అవకాశాలను అందుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యతో పాటు కల్యాణ్ దేవ్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాకి శ్రీధర్ సీపాన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున అవిక పుట్టిన రోజు కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. కలర్ఫుల్ ఫ్రేమ్స్ లో అవికాను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.