కాబోయే భర్త మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి : రష్మిక మందన్న

Admin 2021-07-01 14:33:12 entertainmen
టాలీవుడ్ లో కన్నడ భామ రష్మిక మందన్న ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమా ఆఫర్లతో అగ్ర నటిగా కొనసాగుతోంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమె అవకాశాలను చేజిక్కించుకుంటోంది. 'మిషన్ మజ్ను' అనే సినిమాతో పాటు, 'గుడ్ బాయ్' అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తోంది. తాజాగా తన అభిమానులతో ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారా కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. మీరు స్మోక్ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా... తనకు స్మోకింగ్ అంటే అసహ్యమని చెప్పింది. స్మోక్ చేసే వారి పక్కన నిలబడాలన్నా తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది.