- Home
- tollywood
కొత్త లుక్ తో అఖిల్
అఖిల్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమా నిర్మాణంలో నాగ్ భాగస్వామ్యం కూడా ఉందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. సినిమా షూటింగు చాలావరకూ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అయితే అక్కడ ఎన్ని రోజుల పాటు షూటింగు చేసినా, ఆ ఖర్చు అంతా కూడా నాగ్ ఖాతాలోకే వెళ్లనుందట. అఖిల్ సినిమా కథాకథనాల విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇంతవరకూ అఖిల్ స్థాయికి తగిన హిట్ పడలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ పడాలనే ఉద్దేశంతో నాగార్జున ఉన్నారు.