- Home
- bollywood
రాజ్ కుంద్రా కేసులో ఆశా షైని పేరు
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కుంద్రాతో సంబంధం ఉందని భావిస్తున్న కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ఇప్పటికే వారి స్పందనను తెలియజేశారు.
మరోవైపు, హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు విచారణ అధికారులు నోటీసులు కూడా పంపారు. తాజాగా ఆశా షైని కూడా ఈ అంశంపై స్పందించింది. బాలకృష్ణ సినిమా 'నరసింహనాయుడు'లో 'లక్స్ పాప'గా ఆశా షైని గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను తాను ఎప్పుడూ కలవలేదని ఆశా షైని తెలిపింది. ఇద్దరు వ్యక్తులు వాట్సాప్ లో చాటింగ్ చేసుకున్నప్పుడు తన పేరు వచ్చినంత మాత్రాన...