- Home
- tollywood
ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీ, దినేశ్ జోడీగా శ్వేత అవస్తి
తెలుగు తెరకి మరో ప్రేమకథ పరిచయం కానుంది .. ఆ సినిమా పేరే 'మెరిసే మెరిసే'. ప్రేమ .. దాని చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ తో కూడిన కథ ఇది. పవన్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు. నాయకా నాయికలుగా దినేశ్ తేజ్ - శ్వేత అవస్తి నటించిన ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను హీరో విష్వక్సేన్ తో రిలీజ్ చేయించారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనీ, సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం తనకి ఉందని విష్వక్సేన్ అన్నాడు. శ్రీమంతుడి కొడుకైన హీరో ఓ పార్టీలో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. అయితే అప్పటికే ఆమెకి వేరొకరితో ఎంగేజ్ మెంట్ జరిగిపోతుంది. అయినా ప్రేమంటూ ఆమె వెంటపడి అనుకున్నది సాధిస్తాడు.