శంకర్ సినిమాలో బాలీవుడ్ కియారా ఫిక్సయిందట!

Admin 2021-07-30 20:50:12 entertainmen
మెగా హీరో రామ్ చరణ్ బాలీవుడ్ భామ కియారా అద్వానీతో కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఆమధ్య 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్, కియారా జోడీ కలసి నటించింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలసి నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ తన తాజా చిత్రాన్ని చేయనున్నాడు. ఇది చరణ్ కు 15వ సినిమా. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తాడని కూడా వార్తలొస్తున్నాయి. అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం.