- Home
- tollywood
పవన్ సరసన నిత్యామీనన్ ఖరారు
పవన్ కల్యాణ్.. రానా ప్రధాన పాత్రధారులుగా ఒక సినిమా రూపొందుతోంది. సాగర్ కె.చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకి ఇది రీమేక్. అలాంటి ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ .. రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రోజు నుంచి పవన్ - నిత్యామీనన్ కాంబినేషన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. త్వరలోనే ఐశ్వర్య రాజేశ్ కూడా షూటింగులో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.