- Home
- tollywood
100 కోట్ల బడ్జెట్ తో రాక్షసుడు సీక్వెల్ దిశగా సన్నాహాలు
కరోనాకి ముందు వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'రాక్షసుడు' ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. 'రాక్షసుడు' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజుతో ఈ సినిమా రెండు సంవత్సరాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ కోనేరు స్పదించారు. 'రాక్షసుడు' విడుదలై అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయా అనిపిస్తోంది. ఆ సినిమా అందించిన విజయాన్ని మేము ఇంకా మరిచిపోలేదు. 'రాక్షసుడు' సీక్వెల్ గా 'రాక్షసుడు 2'ను నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో చేస్తారు .. సమయం వచ్చినప్పుడు ఆ హీరో పేరును ప్రకటిస్తాము. కథ అంతా కూడా 'లండన్' నేపథ్యంలో జరుగుతుంది .. త్వరలోనే అక్కడ షూటింగు మొదలవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా కోసం 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించడం జరిగింది. 'రాక్షసుడు'ను మించిన ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది" అని అన్నారు.