- Home
- tollywood
ధనుశ్ జోడీగా రాశి ఖన్నా!
రాశి ఖన్నా ఎప్పుడు చూసినా చాలా కూల్ గా ఉంటుంది. గట్టి పోటీ ఉన్నప్పటికీ, తాపీగా తన పని తాను చేసుకువెళుతూ ఉంటుంది. ఆమెకి అవకాశాలు పెరుగుతున్నాయి. తెలుగులోనే కాదు .. తమిళ .. హిందీ భాషల నుంచి కూడా ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో చైతూ సరసన 'థ్యాంక్యూ' చేస్తున్న రాశి ఖన్నా, 'పక్కా కమర్షియల్'లో గోపీచంద్ సరసన అలరించనుంది. ఇక తమిళంలో 'అరణ్మణై 3' .. 'తుగ్లక్ దర్బార్' విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, కార్తీ జోడిగా 'సర్దార్' సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ధనుశ్ తదుపరి సినిమాలోనూ అవకాశాన్ని అందుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ధనుశ్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం రాశి ఖన్నాను సంప్రదిస్తున్నారట.