- Home
- bollywood
చేతికి కట్టుతో సెట్స్ కి..అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్.. తన కొత్త సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యాడు. చెన్నైలో షూటింగ్ జరుగుతుండగా ఆయన కుడిచేతికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్స కోసం ఆయన ముంబై వెళ్లాడు. కొత్త సినిమా సెట్స్‌లో బుధవారం పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కుడి చెయ్యి విరిగింది. దీనికి సర్జరీ అవసరమైంది. అందుకే ముంబైకి క్విక్ ట్రిప్ వేయాల్సి వచ్చింది. సర్జరీ పూర్తయింది. కట్లన్నీ కట్టేసుకుని పని మొదలు పెట్టడానికి మళ్లీ చెన్నై వచ్చేశా. షో ఆగకూడదు కదా! మా నాన్న అన్నట్లు ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ కెరీర్ పరంగా చివరగా అనురాగ్ బసు దర్శకత్వంలో లూడో సినిమాలో, ఆ తర్వాత హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ది బిగ్ బుల్’ చిత్రాల్లో అభిషేక్ కనిపించాడు.