పూజ, స్టయిలిష్ గా ప్రభాస్​.. క్లాసిక్​ గా ‘రాధేశ్యామ్​’ కొత్త పోస్టర్ విడుదల​!

Admin 2021-08-30 02:40:40 ENT
ప్రేమకథతోనే ‘రాధే శ్యామ్’గా వస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పుజ హెగ్డేలు. ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. పియానో వాయిస్తుండగా, జెంటిల్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఆ వైపు చిరునవ్వులను చిందిస్తూ ఆప్యాయంగా చూస్తున్న ఆ పోస్టర్ క్లాసిక్ గా అనిపిస్తోంది. ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

వచ్చే ఏడాది జనవరి 14న సినిమాను విడుదల చేస్తామన్నారు. జన్మాష్టమి రోజున రాధేశ్యామ్ పోస్టర్ ను విడుదల చేయడం ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు.