- Home
- tollywood
తమన్ చేతిలో భారీ ప్రాజెక్టులు
తమన్ ఒక సినిమాకి వర్క్ చేస్తున్నాడంటేనే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఇక తాను పని చేస్తున్న సినిమా గురించిన అప్ డేట్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందించడం తమన్ ప్రత్యేకత. ఆయన చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి .. చరణ్ .. మహేశ్ బాబు తాజా చిత్రాలకు ఆయనే సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ 'ఏజెంట్' సినిమాను చేయడానికి కూడా తమన్ ఒప్పుకున్నాడు. దాంతో ఆయన హిప్ హాప్ తమిజాను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ధృవ' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.