త్వరలోనే థియేటర్లలో విడుదల 'రొమాంటిక్'

Admin 2021-09-05 11:32:21 ENT
ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్' అనే సినిమా రూపొందింది. సొంత బ్యానర్ పై పూరి నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ పాదూరి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే పూర్తయింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమా ఓటీటీకి వెళుతుందా? థియేటర్లకు వస్తుందా? అనే విషయంలో కొన్ని రోజులుగా ఆసక్తి నెలకొంది. దీనిపై వివరణనిస్తూ, ఈ సినిమాను సాధ్యమైనంత త్వరలోనే థియేటర్లలో విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ చెప్పారు. మొత్తానికి ఈ సినిమా థియేటర్లలోనే యూత్ విజిల్స్ మధ్య సందడి చేయనుందన్న మాట.