దిల్ రాజు నిర్మాణంలో భారీ చిత్రం

Admin 2021-09-08 11:42:35 ENT
రామ్ చరణ్, దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న భారీ చిత్రానికి నేడు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఆశ్చర్యకరమైన రీతిలో ఓ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు. వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ చిత్రం కావడంతో ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.