ఈ నెల 10వ తేదీన 'సీటీమార్' విడుదల కానుంది

Admin 2021-09-08 11:59:17 ENT
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన 'సీటీమార్', 'వినాయక చవితి' పండగ సందర్భంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. హైదరాబాదు .. జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. కబడ్డీ నేపథ్యంలో నడిచే ఈ కథలో, గోపీచంద్ సరసన నాయికగా తమన్నా అలరించనుంది.