పవన్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే టైటిల్

Admin 2021-09-10 12:45:20 ENT
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సంచలన విజయాన్ని సాధించింది. పవన్ భారీ విజయాలను అందుకున్నప్పటికీ, ఆ సినిమా వేసిన ముద్రను మాత్రం ప్రేక్షకులు మరిచిపోలేదు.మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో, ఈ సినిమాకి సంబంధించిన కసరత్తు కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను సెట్ చేశారు. భగత్ సింగ్ పేరుకు ముందు భవదీయుడు చేర్చడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకర్షించే ప్రయత్నం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయిని తీసుకున్నారు. కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.