- Home
- tollywood
ముగిసిన రవితేజ ఈడీ విచారణ.. దాదాపు 6 గంటల పాటు
డ్రగ్స్ కేసులలో ప్రముఖ సినీ నటుడు రవితేజ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఈడీ విచారణ నేపథ్యంలో ఈ ఉదయం కరెక్ట్ సమయానికి రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి ఆయన బయటకు వచ్చారు. మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ... ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోయారు. విచారణ సందర్భంగా బ్యాంకు వివరాలు, డ్రైవర్ శ్రీనివాస్ ద్వారా జరిపిన లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది.