కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన నయనతార

Admin 2021-09-10 12:54:01 ENT
విగ్నేశ్ శివన్ ని త్వరలోనే పెళ్లి చేసుకోనున్న కథానాయిక నయనతార ఇకపై నటనను కొనసాగించడంపై స్పష్టతనిచ్చింది. వివాహం అనంతరం కూడా సినిమాలలో నటిస్తానని, నటనను విరమించే ప్రసక్తే లేదని సన్నిహితులకు తాజాగా చెప్పిందట. అందుకే, కొత్త సినిమాలను కూడా అంగీకరిస్తున్నట్టు తెలిపింది. దీంతో ఆమెతో సినిమాలు నిర్మించాలనుకుంటున్న నిర్మాతలు ఊపిరిపీల్చుకుంటున్నారు.