'బంగార్రాజు' చిత్రంలో ఓ స్పెషల్ సాంగులో వేదిక, మీనాక్షి చౌదరి డ్యాన్స్

Admin 2021-09-25 02:36:58 ENT
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగార్రాజు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగులో వేదిక, మీనాక్షి చౌదరి డ్యాన్స్ చేస్తారని సమాచారం. ఈ పాటను ఈ నెలాఖరులో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి విదితమే.