మహేశ్, రాజమౌళి ప్రాజక్ట్ అప్ డేట్

Admin 2021-09-28 12:49:32 ENT
మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ రాస్తున్న స్క్రిప్ట్ చివరి దశలో వుంది. త్వరలోనే మహేశ్ కి రాజమౌళి ఫైనల్ స్క్రిప్టును వినిపిస్తాడని తెలుస్తోంది.