పుట్టే పాప కోసం మంచి పేరు వెతుకుతున్నట్లుగా చెప్పిన రణ్ వీర్

Admin 2021-10-18 03:54:44 ENT
బాలీవుడ్ క్యూట్ జంటల్లో ఒకరు రణ్ వీర్ సింగ్.. దీపికా పదుకునే. వీరిద్దరి రీల్ కాంబినేషన్ మాత్రమే కాదు.. రియల్ కాంబినేషన్ సైతం అదిరిపోయేలా ఉంటుంది. ప్రస్తుతం ‘సూర్యవంశీ ‘83’ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ పలు సినిమాల్లో నటిస్తున్న అతడు బిజీబిజీగా ఉన్నాడు. తనకు పెళ్లి అయిన విషయం అందరికి తెలిసిందేన.ి.. మరో రెండు.. మూడేళ్లలో పిల్లలు కూడా పుడతారన్నారు. ‘మీ వదిన చాలా క్యూట్ గా ఉంటుంది. నేను చాలాసార్లు నీలాంటి పాపను ఇవ్వు. నా లైఫ్ సెట్ అయిపోతుందని అడుగుతుంటానని చెప్పారు. పాప వస్తే మా జీవితం అద్భుతంగా మారుతుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పుట్టే పాప కోసం మంచి పేరు వెతుకుతున్నట్లుగా చెప్పిన రణ్ వీర్ మాటల్ని విన్నంతనే.. తెలుగువారికి అప్రయత్నంగా ఈ సామెత గుర్తుకురావటం ఖాయం. పుట్టేది అమ్మాయా? అబ్బాయా? ముందే ఎలా తెలుస్తుంది? పుట్టే పాప లింగ నిర్దారణ నేరం కదా? ఈ విషయంరణవీర్ కు తెలీదా? ఒకవేళ అతగాడు అనుకున్నట్లు పాప పేరు ఫైనల్ చేసుకున్న తర్వాత.. అబ్బాయి పుడితే?