చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి : కేతిక శర్మ

Admin 2021-10-28 03:38:01 ENT
యూత్ లో విపరీతంగా వినిపిస్తున్న పేరు కేతిక శర్మ. 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా ఈ బ్యూటీ పరిచయమవుతోంది. ఆకాశ్ పూరి జోడీగా ఆమె నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
"నేను ఢీల్లీలో పుట్టి పెరిగాను .. డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. నా ఇన్ స్టా చూసిన పూరిగారు పిలిపించి ఛాన్స్ ఇచ్చారు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా నాకు నేనుగా బ్రతకాలనుకునే మౌనిక పాత్రను పోషించాను. తెరపై నన్ను నేను చూసుకోవాలనుకునే నా కోరిక నెరవేరబోతోంది.
హీరోయిన్లలో సాయిపల్లవి అంటే నాకు చాలా ఇష్టం. రీసెంట్ గా ఆమె నటించిన 'లవ్ స్టోరీ' చూశాను. ఆమె చాలా గొప్పగా నటించింది.