- Home
- tollywood
ఎన్టీఆర్ కి జోడీగా రష్మిక మందన్న
పూర్తి స్క్రిప్ట్ రెడీ కాగా, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తాను చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రం షూటింగు మొదలవుతుంది. పూజ హెగ్డే, రష్మిక, కియరా అద్వానీ .. వంటి ముద్దుగుమ్మల పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, కథానాయికగా రష్మికను ఫైనల్ చేశారట. తెలుగు, హిందీ భాషల్లో ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక అయితే, తమ ప్రాజక్టుకు మరింత క్రేజ్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని అంటున్నారు.