మళ్లీ మారేడుమిల్లి అడవులకు 'పుష్ప'

Admin 2021-01-04 14:03:14 entertainmen
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ ఈ నెల 8 నుంచి తిరిగి మారేడుమిల్లి అడవుల్లో నిర్వహిస్తారు. గత నెలలో అక్కడ ఓ షెడ్యూలు జరుగుతుండగా, యూనిట్ లో కొందరికి కరోనా సోకడంతో అర్థాంతరంగా షూటింగును నిలిపివేసి, చిత్ర బృందం హైదరాబాదుకి తిరిగొచ్చిన సంగతి విదితమే.