- Home
- bollywood
విజయ్ సేతుపతి సరసన బాలీవుడ్ భామ కత్రిన కైఫ్
బాలీవుడ్ భామ కత్రిన కైఫ్ తాజాగా ఓ దక్షిణాది సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందే సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఓ భారీ హిందీ చిత్రాన్ని ప్రకటించాడు. వరుణ్ ధావన్ హీరోగా 'ఎక్కిస్' పేరిట రూపొందే ఆ చిత్రం భారీ బడ్జెట్టుతో నిర్మాణం జరుపుకుంటుందని పేర్కొన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఇప్పుడు విజయ్ సేతుపతి, కత్రిన కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇది తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుందని అంటున్నారు.