మహేశ్ సినిమా కోసం బరువు పెరిగిన కీర్తి

Admin 2021-01-13 21:01:14 entertainmen
మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాగా సన్నబడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడీ చిత్రం కోసం దర్శకుడి సూచనలపై కాస్త బరువు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి ఈ చిత్రం షూటింగును దుబాయ్ లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.