- Home
- tollywood
తమిళ దర్శకుడితో రామ్ ప్రాజక్ట్
సంక్రాంతికి 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడితో చేయనున్నాడు. గతంలో విజయ్ తో 'జిల్లా' చిత్రాన్ని రూపొందించిన ఆర్.టి. నీసన్ తో రామ్ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై నీసన్ తో చర్చలు జరుగుతున్నాయట.