ఆక్టోబ‌ర్ 8న విడుద‌లవుతుంద‌ని పేర్కొన్న న‌టి

Admin 2021-01-23 21:39:20 entertainmen
బాహుబ‌లి సినిమా త‌ర్వాత‌ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మ‌ల్టీ స్టార‌ర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల ఎప్పుడ‌నే విష‌యంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది. రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో ఆ అంచ‌నాల‌ను మ‌రింత పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటువంటి స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ సినిమా తేదీని ఎవ‌రికీ చెప్ప‌కుండా ప్ర‌క‌టించేసింది. ఈ సినిమా విడుద‌ల తేదీ అక్టోబ‌రు 8 అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీలో తెలిపింది. హాలీవుడ్‌లో సినమా విడుద‌ల తేదీలను ముందుగానే ప్ర‌క‌టించి, క‌చ్చిత‌మైన తేదీకి విడుద‌ల చేస్తుంటారు. టాలీవుడ్‌లోనూ అలాగే చేస్తార‌ని ఆమె అనుకుని ఇలా సినిమా తేదీని ప్ర‌క‌టించి ఉంటుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.