తాజాగా మళ్లీ టాలీవుడ్ పై దృష్టిపెట్టిన అవిక

Admin 2021-01-25 20:46:35 entertainmen
బుల్లితెర సీరియల్ 'చిన్నారి పెళ్లికూతురు'తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. తొలిసినిమా హిట్టవ్వడంతో పలు ఆఫర్లు ఆమెకు వచ్చాయి. దీంతో 'సినిమా చూపిస్త మావా', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ మాయమైంది. మళ్లీ అవికాకు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సరసన ఓ చిత్రంలో చేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా తనే వెల్లడించింది. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో అవికా గోర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న ఈ చిత్రం షూటింగులో ఈ చిన్నది పాల్గొంటోంది.