- Home
- tollywood
సిలువలో ఉన్న ఏసు క్రీస్తులా ఫొటో : జగపతి బాబు
సిలువలో ఉన్న ఏసు క్రీస్తులా సినీనటుడు జగపతి బాబు పోస్ట్ చేసిన ఫొటోను చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తలకు ముళ్ల కిరీటం, మేకులతో సిలువకు కొట్టిన చేతులు, రక్తం కారుతోన్న ముఖంతో జగపతి బాబు ఇందులో కనపడుతున్నాడు. ప్రస్తుతం జగపతి బాబు.. విద్యాసాగర్ దర్శకత్వంలో ఫాదర్-చిట్టి-ఉమా-కార్తిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. వచ్చేనెల 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో జగపతి బాబు తండ్రిగా కనిపించనున్నాడు. ఇవేకాక పలు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. తండ్రి పాత్రలతో పాటు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఆయన వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.