ప్రస్తుతం 'సర్కారు వారి పాట'లో కీర్తి

Admin 2021-01-28 12:44:35 entertainmen
హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని, ప్రస్తుతం మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కీర్తి సురేశ్ తాజాగా మరో కొత్త చిత్రానికి సంతకం చేసింది. ఇలా కొత్త చిత్రం ఒప్పుకోవడంలో విశేషం ఏమీ లేకపోయినప్పటికీ, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నది వాళ్ల తండ్రే కావడం ఇక్కడ విశేషం. అందుకే, ఈ చిన్నది ఇప్పుడు తెగ ఆనందపడుతోంది. 'వాశి' అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. తోవినో థామస్ హీరోగా నటించే ఈ చిత్రాన్ని కీర్తి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి కీర్తి తల్లి, మాజీ నటి మేనక, ఆమె సోదరి రేవతి సహనిర్మాతలుగా వ్యవహరిస్తుండడం మరో విశేషం. తండ్రి నిర్మించే సినిమాలో నటించగలగడం అనేది ఏ అమ్మాయికైనా అదొక కల లాంటిది. అసలు ఇలా తండ్రి బ్యానర్లో నటించడం అన్నది చాలా ఈజీ అని చాలామంది వాదిస్తారు. కానీ, కచ్చితంగా చెప్పాలంటే, ఏదీ అంత ఈజీగా రాదు. వాశి సినిమా కార్యరూపం దాల్చడానికి ఏడేళ్లు పట్టింది"