వ‌కీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల

Admin 2021-02-01 13:25:35 entertainmen
ఈ వేస‌వి కాలం అంతా పెద్ద పండుగ‌ను చేసుకోబోతున్నారు. వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాల విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వ‌కీల్ సాబ్‌, ర‌వితేజ ఖిలాడి సినిమాల విడుద‌ల తేదీల‌ను ఆయా సినిమా యూనిట్లు ప్ర‌కటించాయి. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న వ‌కీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా న‌టిస్తోంది. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన కొత్త‌ పోస్టర్‌లో ఎర్ర కండువా, ర‌క్త‌పు మ‌ర‌కల‌ చొక్కాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌న‌ప‌డుతూ త‌న ఉగ్ర‌రూపాన్ని చూపాడు. మ‌రోవైపు, టాలీవుడ్ హీరో ర‌వితేజ ప్ర‌స్తుతం ఖిలాడి సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవ‌లే ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లైంది. దర్శకుడు రమేశ్‌ వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమాలో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ర‌వితేజ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. ఈ సినిమాకు‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై రూపుదిద్దుకుంటోంది.