- Home
- tollywood
బాలయ్య, బోయపాటి కాంబోలో మూడో చిత్రం
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు. బీబీ3గా పిలుస్తున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలకు దీటుగా ఈ మూడో చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బాలయ్యకు 106వ సినిమా. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. తమన్ సంగీతం అందిస్తున్నాడు.