విజయ్ కు జంటగా రష్మిక మరోసారి

Admin 2021-02-27 11:43:19 entertainmen
రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ స్టార్.. స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి డిమాండులో వుంది. మరోపక్క హిందీలో కూడా నటిస్తూ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హీరో విజయ్ దేవరకొండతో మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయ్ తో ఈ చిన్నది 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. సుకుమార్ తన తదుపరి చిత్రంలో కూడా ఆమెనే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే కనుక విజయ్ దేవరకొండతో ఈ ముద్దుగుమ్మకు హ్యాట్రిక్ సినిమా అవుతుందన్న మాట!