- Home
- tollywood
ప్రభాస్ టీమ్ అధునాతనమైన ఓ ఫ్లాట్ కోసం ముంబైలోని ప్రాంతంలో వెతుకుతోంది
ప్రభాస్ 'సలార్' సినిమాతో పాటుగా 'ఆదిపురుష్' సినిమా కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ముంబైలో మొదలైంది. ఈ భారీ చిత్రం కోసం అక్కడ సెట్స్ కూడా వేశారు. ప్రతి నెలలోను పదిహేను రోజుల పాటు అక్కడ ప్రభాస్ షూటింగులో పాల్గొంటాడు. దీంతో తాను హోటల్ లో ఉండలేక ఓ మంచి ఫ్లాట్ ను కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ టీమ్ అధునాతనమైన ఓ ఫ్లాట్ కోసం ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో వెతుకుతోంది. త్వరలోనే ఫ్లాట్ కొనుగోలు చేయడం పూర్తవుతుందని అంటున్నారు.