- Home
- tollywood
'ఆర్ఆర్ఆర్' : 200 కోట్లకు అమ్ముడు పోయిన రైట్స్
రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ఏర్పడడంతో బడ్జెట్టు వందల కోట్లకు వెళ్లిపోయింది. ఆయన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్' విషయంలో అదే జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. 'ఆర్ఆర్ఆర్'ను అసలుసిసలు మల్టీ స్టారర్ గా చెప్పుకోవచ్చు. తెలుగులో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. దీంతో చిత్ర నిర్మాణానికి సుమారు 400 కోట్లు అవుతున్నట్టు చెబుతున్నారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికే థియేట్రికల్ హక్కుల విషయంలో రికార్డు సృష్టిస్తోంది. మరోపక్క తాజాగా డిజిటల్ హక్కులు కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. స్టార్ నెట్ వర్క్ కు చెందిన డిస్నీ హాట్ స్టార్ ఈ చిత్రం ఓటీటీ హక్కులను సుమారు 200 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం.