- Home
- tollywood
బుమ్రాతో పెళ్లిపై వార్తల్లో నిజం లేదన్న అనుపమ తల్లి
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. అందుకే ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు నుంచి బుమ్రా తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో, అనుపమ తల్లి స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఒక సినిమా షూటింగ్ కోసమే తన కూతురు గుజరాత్ కు వెళ్లిందని తెలిపారు. మరోవైపు అనుపమ గురించి మరోవార్త ప్రచారంలోకి వచ్చింది. ఆమె ప్రేమలో పడింది బుమ్రాతో కాదని... గణేశన్ అనే స్పోర్ట్స్ ప్రజెంటర్ తో అని ప్రచారం జరుగుతోంది.