'ఆచార్య', కొత్త షెడ్యూల్ ఇల్లెందులో షురూ అయింది.

Admin 2021-03-08 15:12:19 entertainmen
 'ఆచార్య' చిత్రం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. 'ఆచార్య' సెట్స్ నుంచి ఓ ఆసక్తికరమైన ఫొటో బయటికి వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ సైనిక దుస్తుల్లో ఉండగా, వారికి దర్శకుడు కొరటాల శివ సీన్ వివరిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఆచార్య', కొత్త షెడ్యూల్ ఇల్లెందులో షురూ అయింది. ఇక్కడి బొగ్గు గనుల్లో ఫైటింగ్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారు.