బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికకు షాక్!

Admin 2021-03-10 13:47:19 entertainmen
బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెను నియమించిన సంగతి తెలిసిందే. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కానీ, సీఎం కార్యాలయానికి గానీ సమాచారమివ్వకుండానే ఆయన నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. దీంతో, ఆయనను సీఎంవో అధికారులు మందలించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె వివరాలను టూరిజం శాఖ తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. శాఖాపరమైన అనుమతులు తీసుకోకుండానే నిర్ణయం తీసుకోవడం... హారిక పట్ల శాపంగా పరిణమించింది.