- Home
- tollywood
ప్రముఖ నటి జమున జీవితకథలో తమన్నా!
బయోపిక్స్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సిల్క్ స్మిత జీవితకథతో వచ్చిన 'డర్టీ పిక్చర్'.. ఇటీవల వచ్చిన సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాలను అందుకున్నాయి. మరో ప్రముఖ టాలీవుడ్ నటి కథను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటి జమున బయోపిక్ ను నిర్మించడానికి ఇప్పుడు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. జమునను, ఆమెతో సాన్నిహిత్యం వున్న పలువురిని కలిసి సమాచారం సేకరిస్తున్నాడట. ఇక జమున పాత్రలో నటింపజేయడానికి తమన్నాను ఆయన సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.