స్కూల్లో తమన్నా నాకు సీనియర్

Admin 2021-03-12 11:20:19 entertainmen
 తమన్నా, పూజా హెగ్డే ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.  పూజ స్వయంగా తెలిపింది ఈ విషయాన్ని.   ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్కూల్ డేస్ కు సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది. తమన్నా, తాను ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని... ఆమె తనకు సీనియర్ అని పూజ తెలిపింది. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా ఆమె డాన్స్ చేసేదని తెలిపింది. ప్రతి ఒక్కరితో చక్కగా కలిసిపోయేదని... తమన్నా లోని కలివిడితనం తనకు ఎంతో నచ్చుతుందని తెలిపింది.