- Home
- tollywood
చరణ్ సరసన మరోసారి కియారా అద్వానీ
చరణ్ తో కియారా అద్వానీ జోడీ బాగుందంటూ అభిమానులు ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం కనిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో కొరియన్ అందాల సుందరి సుజీబే కథానాయికగా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు కియారా కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. శంకర్, చరణ్ కలయికలో వచ్చే చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.