- Home
- bollywood
సీత పాత్ర పోషిస్తున్న అలియా భట్
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 15న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. "దివ్యతేజస్సుతో అలరారే మా సీత వస్తోంది... చూడండి" అంటూ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ట్వీట్ చేసింది.