స‌మంత 'శాకుంత‌లం' సినిమా షూటింగ్ ప్రారంభం.

Admin 2021-03-16 15:46:19 entertainmen
'శాకుంతలం' పేరుతో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తోన్న సినిమా షూటింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.‌ పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న‌ శాకుంత‌లం సినిమాలో స‌మంత ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, దుష్యంతుడి పాత్ర‌లో దేవ్ మోహన్ న‌టిస్తున్నారని ఆ సినీ బృందం స్ప‌ష్టం చేసింది. వారిద్ద‌రి ఫొటోల‌ను పోస్ట్ చేసింది. అప్ప‌ట్లో అనుష్క‌తో 'రుద్రమదేవి' వంటి భారీ చిత్రాన్ని తీసిన గుణశేఖర్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ తీస్తుండ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఒకేసారి నిర్మిస్తున్నారు.