- Home
- tollywood
హోం క్వారంటైన్ లో ఉన్న నటీ
కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కరోనా బారిన పడుతున్న బాలీవుడ్ ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో గడుపుతున్నాడు. యంగ్ హీరోయిన్ తార సుతారియా, మరో నటుడు సిద్ధాంత్ చతుర్వేదిలు కరోనా బారిన పడ్డారు. 'తపడ్' చిత్ర ప్రమోషన్లో తార పాల్గొనాల్సి ఉండగా... కత్రినా కైఫ్, ఇషాన్ కట్టర్ లతో కలిసి 'ఫోన్ బూత్' షూటింగ్ లో సిద్ధాంత్ పాల్గొనాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వారిద్దరూ తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హోం క్వారంటైన్ లో గడుపుతున్నారు.