విలక్షణ పాత్రలతో ముందుకెళుతున్న నటుడు దగ్గుబాటి రానా

Admin 2021-03-23 12:39:19 entertainmen
విభిన్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళుతున్న నటుడు దగ్గుబాటి రానా. అరణ్య చిత్రంలో జంగిల్ మ్యాన్ పాత్ర కూడా అలాంటిదే. హిందీలో హాథీ మేరే సాథీ పేరుతో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు కానీ, దర్శకుడు కానీ ఏ భాషకు చెందినవాడన్నది సినీ రంగం పట్టించుకోదని అన్నారు. ఎవరు ఏ భాషకు చెందినవారైనా నిరభ్యంతరంగా అంగీకరించేది ఒక్క సినీ రంగమేనని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు సైతం ఒక్కసారి టికెట్ కొనుక్కుని థియేటర్ లోకి వెళ్లారంటే ఆ సినిమా ఎవరు నిర్మించారన్నది పట్టించుకోరని, సినిమాలో ఉన్న కంటెంట్ పైనే దృష్టి నిలుపుతారని రానా వివరించారు.