- Home
- tollywood
త్వరలోనే వివాహం చేసుకుంటాం : హీరో విష్ణు విశాల్
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో తమిళ హీరో విష్ణు విశాల్‌కు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 'కాడన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విష్ణు విశాల్ మాట్లాడుతూ...తాను త్వరలో గుత్తా జ్వాలాను వివాహం చేసుకోనున్నట్లు తెలిపాడు. తమది లవ్ మ్యారేజ్ కాదని స్పష్టం చేశాడు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, కానీ, ఆ వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందని బాధపడ్డాడు. అందుకే గుత్తా జ్వాల, తాను ఒకరినొకరం అర్థం చేసుకుని వివాహం చేసుకుంటున్నామని చెప్పాడు.గుత్తా జ్వాల తన అనుభవాలను తనతో పంచుకుందని అన్నాడు.