- Home
- tollywood
లింగుస్వామి షూటింగులో రామ్
రామ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రెడ్' అంతగా ఆకట్టుకోలేదు. కథ విషయంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. జోడీగా కృతి శెట్టి పేరు వినిపిస్తోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో సాగే ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును కూడా రామ్ లైన్లో పెట్టేశాడని అంటున్నారు.రామ్ తో 'రాజా ది గ్రేట్' చేయాలనుకున్నాడు. కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో రవితేజతో తెరకెక్కించాడు. ఆ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధిచింది. అప్పటి నుంచి అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయాలని రామ్ ఉత్సాహాన్ని చూపుతున్నాడు.